![]() |
![]() |

కార్తీక దీపం పార్ట్ 2 సీరియల్ లో నటిస్తున్న నటి పేరు ఉషారాణి. దీపకు అత్త క్యారెక్టర్ లో నటిస్తోంది. రీసెంట్ గా ఈమె ఒక సోషల్ మీడియా ఇన్సిడెంట్ గురించి అందరినీ అలెర్ట్ చేస్తూ ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. విషయం ఏమిటి అంటే తనకు ఒక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉందట. ఐతే వాళ్ళ అబ్బాయి దాన్ని బయటకు తీసుకెళ్లి ఎక్కడో పోగొట్టాడట. ఆ కార్డులో మొత్తం రూ.5 లక్షల వరకు క్రెడిట్ లిమిట్ ఉందని కానీ ఆ కార్డుని వాళ్ళ అబ్బాయి బ్లాక్ చేయించడం మర్చిపోయాడని చెప్పింది. అందులోనూ ఆ కార్డు రెగ్యులర్ గా యూజ్ చేసే ఆన్ లైన్ స్టోర్స్, ఇ-కామర్స్ వెబ్ సైట్స్ కి లింక్ అయి ఉండటంతో వాళ్లకు కావాల్సినవి కొనేసుకుంటూ ఉన్నారు కానీ కార్డు బ్లాక్ చేయించాల్సిన విషయాన్ని మాత్రం పట్టించుకోలేదట.
కొన్నిరోజుల తర్వాత ఉషారాణికి ఒక తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చిందట. ఐతే అవతలి వ్యక్తి చాలా గంభీరంగా తానూ డీఎస్పీ అని కార్డు నంబర్ చెప్పి అది ఒక ఫ్రాడ్ కేసుకు లింక్ అయ్యి ఉందని చెప్పేసరికి మొదట విషయం అర్ధం కాలేదట. అయితే ఆ కేసును క్యాన్సిల్ అవ్వాలంటే మొబైల్ కి ఒక ఓటీపీ వస్తుందని అది చెప్పమని అడిగాడట. వెంటనే ఆమెకు స్ట్రైక్ అయ్యి అసలు ఓటీపీలు చెప్పకండి అని మీరే అంటారు కదా.. మళ్లీ ఓటీపీ ఎందుకు అడుగుతున్నారు ? అని తిరిగి ప్రశ్నించినట్లు చెప్పింది.
ఐతే ఏదో అనుమానం రావడం పోలీస్ స్టేషన్ కి వచ్చి ఓటీపీ చెప్తాను అనడంతో.. అతను ఫోన్ కట్ చేసాడట. కాసేపటికి వాట్సాప్ కి అన్ని డీటెయిల్స్ తో ఒక బిల్ రావడం చూసాక ఏదో తప్పు జరుగుతోంది అనే విషయం తెలుసుకుని వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించినట్లు చెప్పింది. ఇక ఈ ఫ్రాడ్ జరిగిన తీరు మొత్తాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పింది.
![]() |
![]() |